Jeeavamji Deepthi: జాతీయ పారా అథ్లెటిక్స్ లో దీప్తికి స్వర్ణం 1 y ago
జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం 'లక్ష్య' క్రీడాకారులు జీవాంజి దీప్తి, కలేష్ బాషా మెరిశారు. ఈ టోర్నీలో దీప్తి స్వర్ణం, బాషా కాంస్య పతకాలు సాధించారు. మహిళల 400 మీటర్ల పరుగును 57.82 సెకన్లలో ముగించిన దీప్తి అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఎఫ్0 జావెలిన్ త్రోలో బాషా (31.49 మీటర్లు) మూడో స్థానంలో నిలిచాడు.